15, సెప్టెంబర్ 2010, బుధవారం

నిన్న మహేశ్వరీ తో మాట్లాడాను ...ఎంత పెద్దది అయిపొయింది..ఇంకా అమ్మ దాన్ని జానెడు నీరసం జానెడు నీరసం అని తిట్టేది ..అదేనా ఇంతపెద్దరికం తో మాట్లాడుతుంది.. చిన్నపుడు నన్ను సీతా దేవి వే నువ్వు అని అనేదానివి కదా అక్కా.. ఇప్పుడు సీతలాగే అన్ని మౌనంగా ఎదుర్కుంటున్నా అంటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగియాయి..ఏంటో అక్కని అమ్మా,నాన్నను,చెల్లెళ్ళనిఅందరిని తీసుకుని ఎక్కడికన్నా వెల్లిపోవాలనిపిస్తుంది .. మరి నా కుటుంభం ?వాళ్ళ కుటుంభాలు ? నిట్టూర్పు తప్ప సమాధానం ఏది? చిన్న చెల్లి తో మాట్లాడాను ... ఎంత ముచ్చటగా ఉండేవారు పిల్లలు.. పెళ్ళిళ్ళు అయ్యాకా ఇక ఇంతేనా ...ఇన్ని సమస్యలు ఎదుర్కోవాలా? అన్ని బాధ్త్యతల వలయాలేనా ? నేను అలా అంటే వాళ్ళు తేలిగ్గా నవ్వేస్తున్నారు అదే కదక్కా జీవితం అని... నేనే మరీ సెన్సిటివ్ గా ఉన్నానేమో.. దేవుడా ప్లీజ్ అందరూ హేపిగా ఉండేలా చూడవా..

2 కామెంట్‌లు:

Sai Praveen చెప్పారు...

హ్మం.. అంతేనండి జీవితం. చిన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. ఒక వయసు వచ్చాక కష్టాలు తప్పవు సరి కదా, మన వాళ్లతో ఆ కష్టాలు పంచుకోవడానికి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకదు. Modern life! అంతే.

రాజ్ కుమార్ చెప్పారు...

హ్మ్మ్..... ప్చ్...