3, ఏప్రిల్ 2011, ఆదివారం

హమ్మయా ఉగాది పచ్చడి చేసేసా.తినేసా కూడా. ఏమిటో మరీ జీవితం .ఒక పండగ పబ్బం వచ్చినా తెలియదూ .తెలిసినా చేయాలంటే బద్ధకం వచ్చేస్తుంది. అసలు ఈ బద్దకానికి కారణం నేనూ కాదు మా ఆయన పిల్లలు.పండగ ఈ రోజు తలంటుకోండి అంటే విసుగ్గా చూస్తారు.నాన్వెజ్ వద్దు అంటే కసురుతారు .క్రొత్త బట్టలు అంటే ఎహే పో సుత్తి సెంటిమెంట్లు అంటారు. అప్పటికి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దీపావళి లాంటి ముఖ్య పండగలకు వాళ్ళను తిట్టి నేనూ తిట్లు తిని ఏదో అయ్యింది అనిపిస్తాను .ఇదేన్తమ్మా బొత్తిగా మనుషులు ఇలా తయారయ్యారు.చిన్నపుడు పండగలంటే ఎంత ప్రీతిగా చేసుకునేవాళ్ళ. ఇప్పుడు పండగా అంటే చాలు అబ్బ ఎన్ని పండగలోస్తాయమ్మ సంవత్సరానికి అని నా కూతురు . మగపిల్లలు పండగరోజున ఇంట్లో ఉండకూడదట మా అమ్మ చెప్పింది అని మా ఆయన. అసలు మా అత్తగారిని అనాలి ఇలా గారాలు చేసి పెంచినందుకు . ఇంకా నయం మా తోడికోడలు ఉన్దికాబట్టి ఈ మాత్రమన్నా చేస్తున్నా లేకపోతె నేనూ వీల్లలాగే తయారయ్యేదాన్నేమ్మో.పాపం నిన్న వెళ్లి వేప పూవు బెల్లం కొంటుంటే నాకు ఒక పేకెట్ తేవా అంటే తెచ్చిపెట్టింది . సుబ్బరంగా ప్రొద్దున్న లేవగానే ఇల్లంతా దులిపేసి తడిగుడ్డ పెట్టి తుడిచి వంట చేసి గబా గబా స్నానం చేసి ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి మా ఆయనకు ప్రసాదం పెట్టేసాను.నోట్లో వేసుకోగానే నన్ను ఒక రకం గా చూసారు. ఏమిటా అని రుచి చూస్తె నాకు కూడా రక రకాలుగా అనిపించింది.అంటే కొద్ది గా కారం ఎక్కువ అయ్యింది.అయినా మన పిచ్చిగానీ ఉగాది పచ్చడికి రుచిలెమిటీ చాదస్తం కాకపొతే . తరువాత తింటున్నకొద్దీ నాకే సూపర్ నచ్చేసింది పచ్చడి . ఏమిటో మొత్తానికి ఉగాది చేసేసుకున్నాను.వీలుంటే గుడికి వెళ్ళాలి.హూం

5 కామెంట్‌లు:

tnsatish చెప్పారు...

అసలు ఈ బద్దకానికి కారణం నేనూ కాదు మా ఆయన పిల్లలు.

Did you miss comma between మా ఆయన and పిల్లలు, or you intentionally did not put?

I hope you understood the difference that comma makes.
If you don't put comma, it means, your husband's children are the reason behind it.
If you put comma, it means, your husband and children are the reason behind it.

నేస్తం చెప్పారు...

సతీష్
ఇది నా పర్సనల్ బ్లాగ్ అందుకే కూడలి హారానికి జత చేయలేదు.ఎప్పుడన్నా ఏమీ తొచకపోతే రాసుకుంటాను అంతే.మరీ సంతోషం ఎక్కువ అయితే కొద్దిమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళకు నేను తీసిన పొటోలు గట్రాలు చూపిస్తాను.అందుకే కామాలు పుల్స్టాపులు లాంటివి పట్టించుకోను.నాకు అర్ధం అయితే చాలని :)

tnsatish చెప్పారు...

I am fortunate that I am reading your posts which others are not reading.

When you stopped writing in jaajipoolu, I felt very disappointed. But, after seeing your posts on this blog and on buzz, I am very happy.

By the way, Did you block your buzz from public? I never could follow you publicly.

నేస్తం చెప్పారు...

సతీష్ గారు హూమ్ .ఏమో నాకూ ఈ బజ్ గురిన్చి పూర్తిగా తెలియదనడీ.. నన్ను ఫాలొ అవ్వచ్చు కానీ ఎన్తమన్ది ఫాలొ అవుతున్నారు అనేది కనబడకున్డా బ్లాక్ చెసినట్లున్నాను ః)

tnsatish చెప్పారు...

Previously, when I tried to follow you, immediately, I was removed. I thought, you blocked me.

Now, I could follow you. I don't know whether it is the issue from my side or you changed some setting.