పిల్లల సెలవలకి ఎక్కడికి తీసుకువెళ్ళలేదు..పులవుబిన్ ఐలాండ్ కీ అయినా తీసుకువెలాదాం అన్నపుడు నాకు వెళ్ళాలని ఉన్నా బద్దకంగా అనిపించింది.. అప్పటికే తను వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసారు వస్తావా అని..తను అలాగే అన్నయా అనేసాడు.. ఇక ఏం వండాలో ఎప్పుడు బయలుదేరాలో మధుని, నన్ను మాట్లాడుకోమని ఫోన్ మా చేతికి ఇచ్చేసారు.. వర్షం వస్తుందేమో రేపు..ఇద్దరం కారణాలు వెతుక్కోవడం మొదలు పెట్టాం ..కానీ ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒప్పుకోరని తెలుసు ...మొత్తానికి తను చికెన్ బిర్యాని ,నేనూ ఎగ్ కర్రీ ,అన్నం ,పెరుగు తేవడానికి ఒప్పందాలు అయిపోయాయి ...
ప్రొద్దున్న ఎనిమిదికే నాకు మేలుకొలుపులు ..బుజ్జి లే లే అని.. నాకంటే నా కూతురు ఇంకా బద్దకస్తురాలు.. నేను రాను డాడి అనేసింది ..బాబు గాడికి అన్ని మా మహానుభావుడి పోలికలే ..ఇద్దరూ కలిసి మమ్మల్ని లేపేసారు ..గభ,గభ అన్నం కుక్కర్లో పెట్టేసి ఎగ్స్ ఉడకపెడుతూ ఇల్లు సర్దేసాను .. ఈ లోపల పిల్లల స్నానాలు కావోచ్చాయి.. వంట చేసి స్నానానికి వెళ్ళిపోయాను.. తను వండినవి బేగ్ లో సర్దేసారు..అక్కడ ఆడుకోవడానికి ,చిరుతిల్లకు కావలసినవి మంచి నీళ్ళు అని నీట్‌గా ఒక బేగ్ లో సర్దేసాం..
మేము ఇక్కడ భయలు దేరితే మధ్యలో మా మరిది వాళ్ళు మమ్మల్ని కేచ్ చేసారు ...బస్ లో నుండే బాబుగాడు ,మా మరిదిల గోల మొదలు.. ఇద్దరికీ నిమిషం పడదు..ఇక శ్రీవారు కెమెరా తో ఫొటోస్ మొదలు.. అందరం చాంగి విలేజ్ దగ్గర బోట్స్ ఎక్కి సముద్రం లో 20 మిన్స్ జర్నీ ..ఆ సముద్రం నీళ్ళు మీద పడుతుంటె ..ఇక మా తోడికోడలు భావుకత్వం మొదలు పెట్టేసింది.. అక్కా ఆ కెరటాలు చూసావా..ఎంత వయ్యారంగా వెళుతున్నాయో..అచ్చం పూర్వం రోజుల్లో సినిమా తెరలాగా ..కెరటాలను చూసి ఎంతో నేర్చుకోవాలి..ఎన్ని సార్లు పడినా లేస్తునే ఉంటాయి.. ఒక సారి అమ్మకు కవిత రాసి పంపాను కనురెప్పలమాటున కడలి అంత కన్నీరు దాచుకుని చిరునవ్వు చిందిస్తావు..ప్రపంచం లో మంచితనం అంతా మా అమ్మతనము అయ్యి.. అంటూ ఏదో ఏదో చెప్పింది.. మనకి ఇలాంటి విషయాల్లో నాలెడ్జ్ నిల్లు కదా.. ఉన్నట్లు ఉండి అప్పు గుర్తు వచ్చింది.. అలలు అలవెనుక అలలు..అలతో అలలు అంటూ కాసేపు ఇద్దరము అప్పుని, పాపి కొండలుని తలుచుకున్నాం..మా ఆయన నవ్వినా ,తుమ్మినా ఫొటోస్ ..వదినా మీరు వెళండి మీ అందరికీ తీస్తా అని మా మరిది గారు అంటుంటే అందరం బోలెడు పోజులు ఇచ్చేసాం..
ఐలాండ్ రాగానే క్రిందకు దిగి సైకిల్స్ తీసుకున్నాం.. నాకు అసలు త్రొక్కడం రాదు కాబట్టి త్విన్ సీటర్ సైకిల్ తీసుకున్నారు ..మా మరిది వాళ్ళు కూడా సేం అలాంటిదే ..పిల్లలు ఇద్దరూ చెరొక సైకిల్ ...ఇక బయలు దేరుదాం అనుకునేంతలో మందారాలు తెగ కనబడ్డాయి..
నేనూ ఫొటోస్ తీస్తా ప్లీజ్ ప్లీజ్ అని కెమరా పట్టుకుని పరుగులు పెట్టాను.. దారంతా అలాగే ఏడిపించేసాను ..పాపం ఏమీ అనలేదు ...అంటే అంత రేటు పెట్టి ఎందుకు కొన్నారు అని గొడవ మొదలు పెడతాగా :) ఇకంక అక్కడి నుండి సైకిల్ త్రోక్కడమే పని.. అలా అయిదు గంటలు నాన్‌స్టాప్ గా దివి మొత్తం తిరిగాము.. మధ్యలో బాబుగాడు ఇక నావల్ల కాదు అని మా తోడికోడలిని క్రిందకు దింపేసి మా మరిది వెనుక కూర్చున్నాడు .. పాపం తను వాడి సైకిల్ త్రోక్కింది..అంత చిన్న సైకిల్ త్రొక్కుతుంటే ..బాగా కాళ్ళు నెప్పి పుట్టాయంట ..మధ్యలో మా ఆయన ఏమ్మా బాగా నరకం చూపించేస్తున్నాడా బాబు గాడు అనగానే ..మామూలుగా కాదు బావగారు మహా నరకం అని నవ్వింది..హహ మొహమాటానికయినా లేదు బావగారు అంటావనుకున్నా అని తను నవ్వితే.. ఆ స్టేజ్ దాటిపోయాను బావగారు అని అనేసరికి అందరం బాగా నవ్వుకున్నాం..
దారిలో పాప మరీ గోల చేసింది.. అమ్మా నువ్వెందుకమ్మా సైకిల్ నేర్చుకోలేదు ..లేకపోతె నేనూ డాడీ వెనుక కూర్చునేదాన్ని అని.. అందుకే అన్నీ నేర్చుకో కూడదే అనగానే.. సిగ్గులేదు గాడిదా అని మా ఆయన తిట్టారు :) ఇక భోజానాలు సమయం అయ్యేసరికి మాకు తెలిసిన విషయం మేము దారి తప్పిపోయాం ..ఇక నావల్ల కాదు అని బాబు గాడు పేచీ..సరే అని అక్కడె ఉన్న షెల్టర్‌లో కూర్చుని భోజనాలు కానిచ్చేసాము..ఎక్కడా వాటర్ దొరకలేదు ..అక్కడ దొరుకుతుందేమో అని మా మరిదిగారు వాటర్ తేలేదు..నేను తెచ్చిన వాటర్‌తోనే గొంతు తడుపుకోవలసి వచ్చింది ..ఒకటే దాహం
అందరం రాముడు ,సీత ఆడాం.. ఎప్పుడు చూసినా మా ఆయన రాముడు .. మధు కీ సీత వచ్చేవి ...చివరకు తనే గెలిచింది.. ఎక్కువ సున్నాలు మా ఆయనకే.. హైలైట్ మా మరిది, బాబు గాడు ఎవరు దొంగలో కనిపెట్టేయడం .. బాగా ఎంజాయ్ చేసాం.. మళ్లీ అక్కడి నుండి వెతుక్కుని మేము అనుకున్న ప్లేస్ కీ వచ్చి టెంట్ ఓపెన్ చేసాము ..మంచి నీళ్ళు తెమ్మనమని మా ఆయన్ని,మరిదిగారిని పంపిస్తూ ఇక్కడ రామ్బుటాన్స్ దొరుకుతాయి క్రొద్దిగా తీసుకురారా అనగానే మా ఆయన ఫేస్ వైపు చూడాలి ...అయ్యో పాపం అని జాలి లేదు.. ఇప్పుడే అన్నీ తినాలా గాడిదా.. అయినా ఇది సీజన్ కాదు అని వెళ్ళారు.. అక్కడి నుండి నేనూ ,మధు చాలా ఫొటోస్ తీసాం.. రాళ్ళకు అతుక్కుపోయిన గవ్వలు, క్రింద పేరుకు పోయిన బురదా..
ఇక్కడా సముద్రంలో ఇండో నేషియా బోర్డరో థాయిలాండ్ బోర్డరో ఏదో చెప్పారు కనబడుతుంది ,మంచి నీళ్ళు తీసుకురాగానే కరువు ప్రాంత ప్రజల్లా మొత్తం బాటిల్స్ తాగేసి కాళీ చేసేసాం ..కాసేపు కబుర్లు అయ్యాకా మళ్లీ మా ఆయన మరిది పిల్లలు కాస్త కాస్త తిండి తిన్నారు.. అన్ని సర్దుకుని మళ్లీ చలో ఇంటికి ..మళ్లీ దారి తప్పిపోయాం.. అంటా అడవిలా ఉంది ...దానికి తోడు నా డ్రెస్స్ చున్ని సైకిల్ చైన్‌లోకి వెళ్ళిపోయింది ....మొన్న ఇండియా వెళ్ళినపుడు తెచ్చిన డ్రెస్స్ అది..బోలెడు ఖరీదు పెట్టికొంటారా ..ఎందుకు కొన్నారు అని గొడవేసుకున్నాను ..మొత్తం గ్రీజ్ అంటుకుంది.. బాగా అయ్యిందా.. ఇప్పుడు హేపీయా అన్నారు ..ఏం కాదు సేం కలర్ కలిసిపోయిందిలే అని కవర్ చేసుకున్నా..
అక్కడి నుండి మధ్య మధ్యలో చైన్ ఊడిపోవడం ..మా ఆయన తిరిగి పెట్టడం ..నేను కనబడిన ప్రతి దానికి ఫొటోలు తీసేయడం దారిలో పనస పళ్ళు అవి ఫొటోస్ తీసుకుంటుంటే ఉడుము కనబడింది.. మా ఆయన గారు కెమెరా సర్దుకునే సరికి అది పారిపోయింది.. అక్కడ చాలా పాములు ఉంటాయంట.. సాయంత్రం అవుతుండగా భయం వేసింది..ఎవరో తప్పుడు అడ్రెస్స్ చెప్పారు..అబ్బా ఒకటే తిరుగుడు అయ్యింది ..చివరకు ఎలా అయితేనేం సరి అయిన ప్లేస్ కీ చేరుకున్నాం.. ఇంటికి వచ్చేయండి అక్కా తినేసి వెలుదురుగాని అంది మధు,,
నాక్కూడా ఇంటికి వెళ్లి వండే ఓపికలేదు ...వాళ్ళ ఇంటి దగ్గర బస్ దిగగానే ఇక గాడు నిద్ర పోయాడు ..నేనూ మధు వంట చేసేసి అందరం తినేసి ..పిల్లల్ని తీసుకుని ఇంటికోచ్చేసాం
ఇక్కడ కనబడిన మందారాలు వేరుగా పెడాతను ఫొటోస్ ..అనేక రకాలయిన పువ్వులు మాత్రం భలే ఉన్నాయి
22 కామెంట్లు:
frist comment nade
second comment
3
4th
అక్కయ్యా... భలే ఉంది టపా:) నన్ను తలుచుకున్నారా..? ఆననందమానందమాయే.. సూ..పర్ సూ..పర్:))
ఫోటోస్ బాగున్నాయి, టపా బాగుంది:) నన్ను గుర్తు చేసుకోడం ఇంకా బాగుంది:) ధన్యవాదాలు, మీకు మీ మధు గారికి కూడా..
మందారాలు ఎక్కడ అక్కయ్యా..!! ఎప్పుడు పెడతారు?
గవ్వల ఫోటో సూ...పర్ :)
అక్కా.. ఫోటోలు కేక... లాస్ట్ ఫోటో రచ్చ... ఇంకా ఆ నత్త గుల్లలు కూడా..
అన్నీ బాగున్నాయి కానీ ఒకటే నచ్చలేదు. ఫస్ట్ మూడు కామెంట్లు శివ గారు కొట్టెయ్యడం..:(
శివ గారు, మీకు అభినందనలు:)
శివప్రసాద్ గారు.. అభినందనలు.
అపర్ణ గారు..పండగ చేసుకోండి..
అక్కా..ఫస్ట్ ఫోటో లో ఉన్నది ఎవరూ?
>మా ఆయన నవ్వినా ,తుమ్మినా ఫొటోస్
హహ్హహ్హా. బావ గారిని మాత్రం వదలరు కదా..
పనసకాయ.. భలే కలర్‌ఫుల్ గా ఉంది.. తెచ్చేసుకున్నారా ఇంటీకి?
"పులావుబిన్" అంటే యేమిటీ?
బావగారు.. మాయాబజార్ సినెమా లో పాండవుల టైపు.. స్టోరీ అంతా వారిదే కానీ తెరపై కనిపించరు
బాగా చెప్పావు వేణూరాం..:))
మందారాలు వస్తాయి వస్తాయి మేడం ..ఆగండి.నీ గురించే మాట్లాడుకున్నాం మేడం .
రాజ్ ఆ గవ్వలను చూస్తే జలదరించింది వళ్ళు ..ఒక ఇద్దరు చైనా అమ్మాయిలు ఆ గవ్వలను వొలుస్తున్నారు ..ఇంటికి వెళ్ళి వండుకోవడానికి..అబ్బా అక్కడ సముద్రం అంతా బంక మన్ను ..నా కాళ్ళకు అదే అంటుకుంది అప్పుడే అనుకోకుండా తీసా నాకాళ్ళకు పొటో
రాజ్ లాస్ట్ పొటో సూపర్ కదా నేనే తీసా.. నేనే తీసా ..ఆ మాట కొస్తె అన్ని పొటోస్ నేనే తీసాలే..
ఫస్ట్ పిక్ లో బావ ,పాప
పనసకాయ ఇంటికి తెచ్చుకోవడమా.. బాబు మీ బావ గారి గురించి మీకు తెలియదు చిన్న స్టోరీ అవుతుంది చెప్పితే ..అంత సీన్ లేదు
>>బావగారు.. మాయాబజార్ సినెమా లో పాండవుల టైపు.. స్టోరీ అంతా వారిదే కానీ తెరపై కనిపించరు
హహహ్ నువ్వు కనబడవు కాని సూపరూ
siva prasad :)
hi iam new to this site. but stories are good.
కెమెరా super
pics కూడా కేక
aa cycle thokkalekane nenu pulau Ubin Island ki vellatam ledhu. Maa aayanki naaku cycle vachani thelusandi..;). Maa vaaremo please ekkadikanna veldam raa antaru..aa vellemundhu chese cooking ke naa pranam-opika kastha hareee antunayee...inka akkada cycle thokkatam kudana :)). Inthaki nachindha Island.
కామెంట్‌ను పోస్ట్ చేయండి