27, డిసెంబర్ 2010, సోమవారం

మా అబ్బాయి తీసిన చిత్ర రాజంలు
అమ్మాయిలను తీసాడా ?లేక లైబ్రరి నా అనే డవుట్ కన్నతల్లిని నాకేరాలేదు..మీకు అసలు రాకూడదు ...


భంగిమ
ముందు నుండి ఎవరయినా ఫొటోస్ తీస్తారు.. వెనుక నుండి తీస్తేనే వెరైటీ
ఒక బిల్డింగ్


రెండు బిల్డింగులు

మూడు బిల్డింగులుబిల్డింగ్ ముందు చెట్టు


మరి బిల్డింగ్ ముందు బస్సు కూడా ఉండాలిగా


వాడిన పూలే వికసించెనే ..పాపం ఫ్రెష్ పూలేమి కనబడలేదు మా ఆయనకు.. :(

ఇది నేనే ,నేనే తీసా (ఉహా హా హా )
ముందు మా ఆయన ను నించో పెట్టాను.. పిండి బొమ్మలా పడ్డారు.. అది మనిషి ఫాల్టండి ...తాయడం లో లోపం లేదు అంటే వినరే ..నాకు పోకస్ చేయడం రాదట.. అందుకే ఆయన్ని ప్రక్కన తోసేసి ఇదొక్కటే తీసాచెట్టు..అల్లెక్కడో ఉంది ..అర్జునుడు పిట్ట కన్ను మాత్రమే చూసినట్లు జూమ్ లో కాయలోక్కటే చూసి తీసా

పిల్లిపిల్ల పాపం చలికి లైట్ వేడిలో కూర్చుంది ..దాన్ని కూడా వదిలి పెట్టలేదు :)

22, సెప్టెంబర్ 2010, బుధవారం

ఈ రోజు ఉలవారు చేసాను.. మొన్న ఎప్పుడో స్నేహ ఉలవలు ఇచ్చి వెళ్ళిపోయింది.. ఎలా వండాలో తెలియక ఇన్నాళ్ళు ఓ మూలన పడేసా ...నిన్న ఒక ఫ్రెండ్ చెప్పారు ఎలా చెయ్యాలో..సింపులే గాని టైం పడుతుంది .. అయినా మిగిలిన పనులు చేస్తూ ఉండటం వల్ల పెద్దగా నాకు శ్రమ తెలియలేదు..బాగా వచ్చింది..మావారి కసలు అది ఉలవ చారని చెప్పనే లేదు ...ఎమంటారో తిని
యూ ట్యూబ్లో లింకు కూడాఉంది


ముందు ఉలవలు ఒక బౌల్ లో (రెండు గుప్పెళ్ళు ఒక కుటుంభం కూ సరిపోతాయి)రాత్రి అంతా నాన బెట్టి ప్రొద్దున్న మూడు బౌల్స్ నీరు పోసి కుక్కర్లో ఉడికించాలి ..తరువాత నీటిని వడకట్టి ఆ నీటిలో టమాట ముక్కలు,కొద్దిగా చింత పండు పులుసు,కారం,ఉప్పు,పసుపు ,కరివే పాకు వేసి మరగనివ్వాలి ..ఈ లోపల వడగట్టిన ఉలవల్లో సగం మిక్సి పట్టి ఇందులో కలిపేయాలి.. ఈ మిశ్రమం అంతా బాగా ఉడకనివ్వాలి ..ఉలవ చారు ఎంత మరిగితే అంత రుచి ... దగ్గరకు వచ్చాకా ...(సగానికి సగం మరిగిపోవాలి)తాలింపు వేయడమే ...

16, సెప్టెంబర్ 2010, గురువారం

ఈ రోజు అమూల్ పేకెట్ పాలు మళ్ళి విరిగిపోయాయి ...వద్దు బాబోయ్ అవి కొనద్దు అన్నా ఇలాగే కొంటారు ఈయన..అయినా దాదాపు రెండేళ్లనుంది అముల్ పాలు ఇలాగే వస్తున్నాయి...ఎవరు కంప్లైంట్ చేయడం లేదా? ...ఎలా కొంటున్నారు బాబు అవి...మొదట్లో సుద్ది చేసిన పాలే కదా అని కొద్దిగా వెచ్చబెట్టి తోడుపెట్టేసేదాన్ని.అమ్మో అమ్మో ఎన్ని తిక్కపనులు చేశా.. దొంగ మొహం గాడు..నందిని బాగానే ఉంటున్నాయి అవి కొనాలి ఈసారి.. అయిన ఫ్రెష్ మిల్క్ బెటర్.. ఏమోలే మొన్న మాస్టర్ పూరా మిల్క్ బోలెడు డబ్బులు పోసి కొంటేఅవీ ఇలాగే ఏడ్చాయి కదూ... ఏమో బాబు ఏంకొంటున్నామో ?ఏం మానుతున్నామో? ఆ చైనా ప్రొడక్ట్స్ మరీ చెత్త ...యిలి పాలు త్రాగి చాలా మంది అనారోగ్యం పాలయ్యారట.. నామటుకు నేనూ ఇండోనేషియా యో,ఆస్ట్రేలియా మిల్కో కోనేద్దామని డిసైడ్ అయిపోయా ...

15, సెప్టెంబర్ 2010, బుధవారం

ఈ రోజు మొదటి సారి గూగుల్ బజ్లో సరదాగా పోస్ట్ వేసా ...ఇప్పటివరకు అదేంటో అని తికమక పడిపోయా.. తీరా చూస్తె ఏమి లేదు ..:)
నిన్న మహేశ్వరీ తో మాట్లాడాను ...ఎంత పెద్దది అయిపొయింది..ఇంకా అమ్మ దాన్ని జానెడు నీరసం జానెడు నీరసం అని తిట్టేది ..అదేనా ఇంతపెద్దరికం తో మాట్లాడుతుంది.. చిన్నపుడు నన్ను సీతా దేవి వే నువ్వు అని అనేదానివి కదా అక్కా.. ఇప్పుడు సీతలాగే అన్ని మౌనంగా ఎదుర్కుంటున్నా అంటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగియాయి..ఏంటో అక్కని అమ్మా,నాన్నను,చెల్లెళ్ళనిఅందరిని తీసుకుని ఎక్కడికన్నా వెల్లిపోవాలనిపిస్తుంది .. మరి నా కుటుంభం ?వాళ్ళ కుటుంభాలు ? నిట్టూర్పు తప్ప సమాధానం ఏది? చిన్న చెల్లి తో మాట్లాడాను ... ఎంత ముచ్చటగా ఉండేవారు పిల్లలు.. పెళ్ళిళ్ళు అయ్యాకా ఇక ఇంతేనా ...ఇన్ని సమస్యలు ఎదుర్కోవాలా? అన్ని బాధ్త్యతల వలయాలేనా ? నేను అలా అంటే వాళ్ళు తేలిగ్గా నవ్వేస్తున్నారు అదే కదక్కా జీవితం అని... నేనే మరీ సెన్సిటివ్ గా ఉన్నానేమో.. దేవుడా ప్లీజ్ అందరూ హేపిగా ఉండేలా చూడవా..

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

నిన్న అంటా కంప్యుటర్ ముందే గడిచిపోయింది టైము.. స్మైలీలుఎలా పెట్టాలో తెలియక.. తీరా పెట్టాకా నా కే నచ్చలేదు.. జాబిల్లి పత్రికకు కధలు రాసి పంపి నా బ్లాగ్ లో క్రొత్త పోస్ట్ రాసాను... కళ్ళు లాగాయి.. మహానుబావులు ౧౨ గంటలకు తీరికగా వచ్చారు.. హమ్ ... ఇక ఇప్పట్లో కొత్తపోస్ట్ రాయకూడదు ..

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

ఈ రోజు పూజ హాయిగా చేసుకున్నా... నిన్న లిటిల్ ఇండియా వెళ్లి వెలక్కాయ ,చెరుకు గడ ,వినాయక విగ్రాహం అన్ని తెచ్చుకున్నాను. అబ్బో అయ్యేం రేట్లు బాబోయ్ ..... ప్రొద్దున్నే కుడుములు, చలిమిడి ,పులిహోర,హారిది ,పరమాన్నం ,అన్ని చేసుకుని పూజ చేశా.. సాయంత్రం డౌన్ టౌన్ ఈస్ట్ కీ వెళదాం అంటున్నారు కాని ..అబ్బా ఇంటరెస్ట్ లేదు ... బంగాల దుంప కూర్మా సరిగ్గా కుదరలేదేన్తబ్బా ఈ రోజు... తిడతారో ఏమో పాడు ...

6, సెప్టెంబర్ 2010, సోమవారం

ratatouille ఈ కార్టున్ సినిమా పిల్లలకు బాగా నచ్చుతుంది.. రిమ్మీ అనే ఎలుకకు వంట చేయడం చాలా ఇష్టం.. లింగ్విని అనే అబ్బాయికి వంట రాదు ఒక రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటాడు.. ఈ ఎలుక సహాయం తోఆటను ఎలా పేరు తెచ్చుకుంటాడు .. ఆ క్రమం లో ఎలుక పడే కష్టాలు చాలా బాగుంది

2, సెప్టెంబర్ 2010, గురువారం

ఈ రోజు టిఫిన్ ఏం చేయలేదు ...ఓట్స్ పాలల్లో కలిపేసి పెట్టేసాను తనకి... అబ్బా ఇవి నాకు నచ్చావు అని అన్నా అబ్బే వంటికి చాలా మంచిదటండి అని తినిపించేసాను ...బ్లాగ్స్ లో తార గుర్తొచ్చారు.. ఇలా ఓట్స్ అనగానే క్లాస్ పీకుతారేమో ...అయినా సరే నావల్ల కావట్లే దమ్మా ఒక్కోసారి.. ఇడ్లీ,దోస ఇడ్లీ దోస ఇంకొక టిఫిన్ ముట్టుకోరు ..పోనీ చేద్దామన్నా ప్రొద్దూన్నె వీళ్ళ టిఫిన్లు స్కూళ్ళు, కేరియర్లు ఇవన్ని అయ్యేసరికి నీరసం వస్తుంది..టైమే ఉండట్లా..పాపం ఆరోగ్యానికి మంచిది అని కవర్ చేస్తే చాలు గమ్మున తినేసి వెళతారు ఒక్కోసారి..ఈసారి అలా చేయకూడదు ..ఎలాగో ఓపిక చేసుకోవాలి ..
ఈ రోజు పాటలు వింటూ పనులు చేసుకున్నా.. ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్లు పాట వింటుంటే హాయిగా అనిపించింది.. స్వర్ణ కమలం సినిమా చిన్న అమ్మమ్మ ఇంటిలో చూసాను ..ఎంత నచ్చేసిందో..భాను ప్రియ అంటే అప్పటి నుండి చాలా ఇష్టం.. ఒక సారి నాన్న వద్దు అన్నా సరే బ్రతిమాలి ఈ సినిమా తెప్పించి చూపించాను.. నాన్న చాలా బాగుందిరా అని నన్ను ముద్దు పెట్టుకున్నారు..
కొన్ని మచ్చు తునకలు ఆ సినిమాలోవిఈ రోజు చాలా విసుగ్గా అనిపించింది..నాన్నకు పోన్ చేసాను ...అమ్మతో మాట్లాడాను..అయినా ఏంటో ఒక్కోసారి దిగులు వస్తూ ఉంటుంది..నిన్న ఇంకా తను రాలేదని హీరో సినిమా చూసాను ..దిక్కుమాలిన సినిమా.. ఈ నితిన్ కీ ఏమై చచ్చిందో.. అస్సలు బాలేదు... పోనీ నేనైనా కట్టి పడేయచ్చుగా ... ఉహు ...చెత్త సోది..ఆ తరువాత అదేం సినిమా సీతారాముల పెళ్లి లంకలో అంటా ..వాడి బొంద ...నాకేం నచ్చలేదు..ఒక పార్ట్ అవ్వగానే మల్లేశ్వరి చూసాను.. నాకు కామెడి సినిమాలే నచ్చుతాయి .... హాయిగా అనిపించింది ప్రాణం.. పాప లగాన్ సినిమా ౩౩ సారి చూస్తుంది ...దానికి బాగా నచ్సినట్లుంది.. రోజు పెట్టి చూస్తుంది.. అవును నాకు కూడా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.. సినిమా అంటే అలా ఉండాలి... ఈ మధ్య వీళ్ళ హోమ వర్కులు పట్టించుకోవడం లేదు మున్దాపని చూడాలి..