15, ఆగస్టు 2011, సోమవారం

love you shammi

Taarif karun kya uski jisne tumhe banaya
లవ్ యూ మిస్ యూ షమ్మీ... నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా..చాలా చాలా..నీ అల్లరితనం ,చిన్నపిల్లలతనం,ఆ వెక్కిరింత ,ఆ గెంతులు డ్యాన్సులు..ముఖ్యంగా పాటలు ..నువ్వంటే చాలా చాలా ఇష్టం.. నువ్వు లేవా ఇక :( ఎక్కడికి వెళ్ళిపోయావ్ చెప్పు.. మనసుకెంత కష్టంగా ఉందో తెలుసా

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఈ రోజు చాలా నిద్ర వచ్చేసి౦ది .అసలు బాక్స్ పెట్టలేనేమో అనుకున్నాను .తోటకూర వ౦డుతున్నప్పుడు అప్పూయే గుర్తొచ్చి౦ది .ఇన్కా కౌటిల్య చెప్పిన ఆవ చారు చేసాను .ఇన్కా బోలెడు అ౦ట్లున్నాయి .నావల్ల కాదమ్మా అని పాటలు చూసాను కాసేపు .అనుకోకు౦డా క్రిశ్ణ నటి౦చిన దేవదాసు చూసాను.ఎ౦తయినా పాత దేవదాసు ము౦దు ఏదీ పనికిరాదు.కాని పాటలు మాత్రమ్ బాగున్నాయి .ఎదురిన్టి అమ్మాయికి పొగరు ఎక్కువ ,మేఘాలలో సాగాలి అనే పాట చిన్నపుడు రేడియోలో తెగ వినేదాన్ని .అసలు ఈ సినిమా తీసున్నపుడు రామారావుకి క్రిశ్ణకు గొడవ అయి రిలీజ్ సమయానికి అక్కినేని పాత దేవదాసు సినిమా అదే సమయానికి రిలీజ్ చేయిన్చాడట రామారావు.దానితో ఈ సినిమా మొత్తమ్ తుదిచిపెట్టుకు పోయి౦ది. పాపమ్ కదా ,అప్పట్లో అన్టే నాన్న రామారావు ఫేన్ కాబట్టి ఏమ్ చెప్పినా మేము తనే గొప్ప అనుకునేవాళ్ళమ్ .ప్లిచ్ ఇప్పుడు ఆలోచిస్తున్టే పాపమ్ కదా అనిపిస్తు౦ది.కాక పోతే ఒకటిలే సినిమా అసలేమ్ బాగున్డి ఉ౦డదు. క్రిష్ణ విజయ నిర్మల ను చూస్తేనే అస్సలు నప్పలేదు ఆ పాత్రలకు అనిపిన్చిన్ది. పైగా చన్ధ్రముఖి పాత్ర జయ౦తి.ఓర్నాయనో ..నాకసలు జయ౦తి జగధేక వీరుని కధలో తప్ప ఏ సినిమాలో చూసినా డబ్బాడు కు౦కుమ ,చిటికెడు పసుపు డయిలాగే కనబడుతున్ది. ఇ౦దులో డిఫ్రెన్ట్ రోల్.మేడమ్ ఎలా ఏక్ట్ చేసిన్దో మరి .

3, ఏప్రిల్ 2011, ఆదివారం

హమ్మయా ఉగాది పచ్చడి చేసేసా.తినేసా కూడా. ఏమిటో మరీ జీవితం .ఒక పండగ పబ్బం వచ్చినా తెలియదూ .తెలిసినా చేయాలంటే బద్ధకం వచ్చేస్తుంది. అసలు ఈ బద్దకానికి కారణం నేనూ కాదు మా ఆయన పిల్లలు.పండగ ఈ రోజు తలంటుకోండి అంటే విసుగ్గా చూస్తారు.నాన్వెజ్ వద్దు అంటే కసురుతారు .క్రొత్త బట్టలు అంటే ఎహే పో సుత్తి సెంటిమెంట్లు అంటారు. అప్పటికి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దీపావళి లాంటి ముఖ్య పండగలకు వాళ్ళను తిట్టి నేనూ తిట్లు తిని ఏదో అయ్యింది అనిపిస్తాను .ఇదేన్తమ్మా బొత్తిగా మనుషులు ఇలా తయారయ్యారు.చిన్నపుడు పండగలంటే ఎంత ప్రీతిగా చేసుకునేవాళ్ళ. ఇప్పుడు పండగా అంటే చాలు అబ్బ ఎన్ని పండగలోస్తాయమ్మ సంవత్సరానికి అని నా కూతురు . మగపిల్లలు పండగరోజున ఇంట్లో ఉండకూడదట మా అమ్మ చెప్పింది అని మా ఆయన. అసలు మా అత్తగారిని అనాలి ఇలా గారాలు చేసి పెంచినందుకు . ఇంకా నయం మా తోడికోడలు ఉన్దికాబట్టి ఈ మాత్రమన్నా చేస్తున్నా లేకపోతె నేనూ వీల్లలాగే తయారయ్యేదాన్నేమ్మో.పాపం నిన్న వెళ్లి వేప పూవు బెల్లం కొంటుంటే నాకు ఒక పేకెట్ తేవా అంటే తెచ్చిపెట్టింది . సుబ్బరంగా ప్రొద్దున్న లేవగానే ఇల్లంతా దులిపేసి తడిగుడ్డ పెట్టి తుడిచి వంట చేసి గబా గబా స్నానం చేసి ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి మా ఆయనకు ప్రసాదం పెట్టేసాను.నోట్లో వేసుకోగానే నన్ను ఒక రకం గా చూసారు. ఏమిటా అని రుచి చూస్తె నాకు కూడా రక రకాలుగా అనిపించింది.అంటే కొద్ది గా కారం ఎక్కువ అయ్యింది.అయినా మన పిచ్చిగానీ ఉగాది పచ్చడికి రుచిలెమిటీ చాదస్తం కాకపొతే . తరువాత తింటున్నకొద్దీ నాకే సూపర్ నచ్చేసింది పచ్చడి . ఏమిటో మొత్తానికి ఉగాది చేసేసుకున్నాను.వీలుంటే గుడికి వెళ్ళాలి.హూం
ఈ రోజు ఏమి తోచక యూ ట్యూబ్ చూస్తున్నాను... శ్రీదేవి కూతురు చిరు కొడుకుతో జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీయలట.ఏమిటి ఈ పిచ్చ్చి మొహాలు.కాని రోజులు ఎంత తొందరగా పరుగులు పెడుతున్నాయి.పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు .హూం.మనమేమో ఇంకా ఇంకా ఇంకా పెద్దవాళ్ళం అయిపోతున్నాం.అసలు పెద్దవాళ్ళం అయిపోతున్నాం అనే ఆలోచన ఎందుకు వస్తుంది? మనసు ముసలిది అయిపోతుందా? లేదు ఇంకా మనసు యవ్వనం లోనే ఉంది .శరీరం మాత్రం మార్పులు వస్తున్నాయి .అదే పాపం మెదడు తట్టుకోలేకపోతుంది.ఇంకా నిన్నగాక మొన్న పెళ్లి అయినట్లు అనిపిస్తుంది మరీ దారుణం గా. అమ్మా తల్లి నీకు పెళ్లి అయి ఏళ్ళు అయ్యింది .నీ కూతురు ఇప్పటికే నీ బుజానికీ దగ్గరకు వచ్చేస్తుంది.అని ఎంత హెచ్చరించినా అబ్బే మనకు ఎక్కడం లేదు :) కాని నాకు నవ్వొచ్చే విషయం ఏమిటంటే ఇరవై లో ఉన్నపుడు మొహానికి కనీసం పౌడర్ కూడా రాసేదాన్ని కాదు .ఎంత సేపు పిల్లలు వంట ఇల్లు సుబ్రం గట్రాలు. ఎవరైనా క్రొత్త గా మార్కెట్లో పలానా డ్రెస్సులు ఫ్యాషన్ అట అంటే దీని మొహం ఎప్పుడు చూసినా ఇదే గోల అని తిట్టుకునేదాని.అలాంటిది ఈ మధ్య తెగ క్రీములు కోనేస్తున్నాను.బయటకు వెళ్ళేప్పుడు ప్రత్యేకంగా శ్రద్దగా తయారవుతున్నాను .ఇప్పుడేమో వయసు పెరిగాక ఎందుకని ఇలా చేస్తున్నాను.?అమ్మో అందరి ఆడవాళ్ళల్లా నేనుకూడా తయారవుతున్నానా? అప్పుడు ఎందుకని పట్టించుకోలేదు? బహుసా అప్పుడు పిల్లల బాధ్యతా పైగా వయసులో ఉన్నాం కాబట్టి ఎలా ఉన్నా బాగుందేవాళ్ళం అనేమో.ఇప్పుడేమో ఎంతైనా తేడా వచ్చేస్తుందిగా ..పైగా పార్టీల్లో పంక్షన్లలో మిగతావారితో పోటీలు .ఇప్పుడే ఇలా ఉంటె ఇంకో అయిదేళ్ళు ఆగితే బ్యూటి పార్లర్ల చుట్టూ తిరుగుతానేమో .ప్లిచ్.బుజ్జీ అవసరం అంటావా? వద్దే మనకి ఇవన్నీ.సుబ్బరంగా హుందాగా ఉండు .నీ మొహం నీ ఇష్టం., ఇంకేవరిక్ కోసమో తయారవ్వడం ఏమిటి తోక్కలోలా.ఏమంటావ్? ఎంచక్కా పెళ్ళయ్యింది ఇద్దరు పిల్లలు హాయిగా నీట్గా ఆహ్లాదం గా ఉండు కాని అడ్డమైనవి మొహానికి పూయకు అర్ధం అయ్యిందా? గుడ్ గర్ల్
నిన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది.నేనూ చూడలేదు.భయం వేసింది.మొదటి వికెట్ వీరు అవుత అయిపోగానే ఓడిపోతారనుకున్నాను.మామూలుగా క్రికెట్ చూడను.నాకు చిరాకు.కాని వరల్డ్ కప్ కదా.చూడాలనిపించింది.ఇది మా నాన్న కల.నాన్న ఎప్పుడూ అనేవారు సచిన్ చేతుల మీదుగా కప్ కొడితే చూడాలని.అయ్యో నాన్నా ఈసారి కుదరదేమో అని టివి కట్టేసాను .మళ్లీ మనసు ఆగక చూస్తె సచిన్ డాం వికెట్ గోవిందా.ఛీ ఛీ అని మళ్లీ కట్టేసాను .తరువాత పెట్టగానే కోహ్లి పోయాడు .ఇక చాలు మనం చూస్తె ఇలాంటి విపరీతాలే అనుకుని పూర్తిగా కట్టేసాను .చివ్వరి ఓవర్ పెట్టాను భయంగా..గెలిచేసారు.నేనూ నమ్మలేకపోతున్నా..వెంటనే నాన్న కూ కాల్ చేసాను .ఎంత సంతోషం నాన్నకు. నాన్న మాయ బజార్ సినిమా రంగుల్లో చూడాలని కోరిక అది కూడా తీరిపోయింది.నాన్నసంతోషం గా ఏమి కోరుకున్నా జరిగితే బాగుంటుంది కదా.నాన్నా మీరంటే నాకు చాలా ఇష్టం .మీరెప్పుడు సంతోషంగా ఉండాలి.

7, జనవరి 2011, శుక్రవారం

టైం తొమ్మిది.ఇల్లంతా దుప్పట్లు, గ్లాసులు ,ప్లేట్లు ,పెన్సిళ్ళు ,పెన్నులు, సింకు నిండా గిన్నెలు,బోలెడు బట్టలు...హు హు హు హు హు ..బుజ్జితల్లీ లేరా తప్పదు..ఇవన్నీ కాకుండా వంట కూడా ఉంది..స్నానం పానం ..అది కూడా అయిపోతే హిందీ స్కూల్ కీ వెళ్లి నువ్వే పిల్లలని తీసుకు రావాల్సి ఉండచ్చు ..మూడు గంటలే టైముంది ..రెడీ అవ్వు.. నాలుగు పాటలు పెట్టుకో కమాన్ ..యు కేన్ డూ ఇట్ రే ...

6, జనవరి 2011, గురువారం

ముద్దుకే ముద్దొచ్చే మందారం

అన్ని రకాల పూలు తీయలేకపోయాను..ప్రతి చోటా ఆపితే తంతారని.. కాని చూసిన ప్రతి పూవు ఒక్కో రకమైన ఫీలింగ్ని ఇచ్చాయి..కొన్ని ముద్దుగా కొన్ని అల్లరిగా కొన్ని గడుసుగా కొన్ని అలకగా కొన్ని అందం గా కొన్ని ఆహ్లాదంగా కొన్ని శాంతంగా కొన్ని మత్తుగా కొన్ని గారంగా ..అలా చూస్తూనే ఉండాలనిపించింది