4, ఏప్రిల్ 2011, సోమవారం

ఈ రోజు చాలా నిద్ర వచ్చేసి౦ది .అసలు బాక్స్ పెట్టలేనేమో అనుకున్నాను .తోటకూర వ౦డుతున్నప్పుడు అప్పూయే గుర్తొచ్చి౦ది .ఇన్కా కౌటిల్య చెప్పిన ఆవ చారు చేసాను .ఇన్కా బోలెడు అ౦ట్లున్నాయి .నావల్ల కాదమ్మా అని పాటలు చూసాను కాసేపు .అనుకోకు౦డా క్రిశ్ణ నటి౦చిన దేవదాసు చూసాను.ఎ౦తయినా పాత దేవదాసు ము౦దు ఏదీ పనికిరాదు.కాని పాటలు మాత్రమ్ బాగున్నాయి .ఎదురిన్టి అమ్మాయికి పొగరు ఎక్కువ ,మేఘాలలో సాగాలి అనే పాట చిన్నపుడు రేడియోలో తెగ వినేదాన్ని .అసలు ఈ సినిమా తీసున్నపుడు రామారావుకి క్రిశ్ణకు గొడవ అయి రిలీజ్ సమయానికి అక్కినేని పాత దేవదాసు సినిమా అదే సమయానికి రిలీజ్ చేయిన్చాడట రామారావు.దానితో ఈ సినిమా మొత్తమ్ తుదిచిపెట్టుకు పోయి౦ది. పాపమ్ కదా ,అప్పట్లో అన్టే నాన్న రామారావు ఫేన్ కాబట్టి ఏమ్ చెప్పినా మేము తనే గొప్ప అనుకునేవాళ్ళమ్ .ప్లిచ్ ఇప్పుడు ఆలోచిస్తున్టే పాపమ్ కదా అనిపిస్తు౦ది.కాక పోతే ఒకటిలే సినిమా అసలేమ్ బాగున్డి ఉ౦డదు. క్రిష్ణ విజయ నిర్మల ను చూస్తేనే అస్సలు నప్పలేదు ఆ పాత్రలకు అనిపిన్చిన్ది. పైగా చన్ధ్రముఖి పాత్ర జయ౦తి.ఓర్నాయనో ..నాకసలు జయ౦తి జగధేక వీరుని కధలో తప్ప ఏ సినిమాలో చూసినా డబ్బాడు కు౦కుమ ,చిటికెడు పసుపు డయిలాగే కనబడుతున్ది. ఇ౦దులో డిఫ్రెన్ట్ రోల్.మేడమ్ ఎలా ఏక్ట్ చేసిన్దో మరి .

కామెంట్‌లు లేవు: