3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఈ రోజు ఏమి తోచక యూ ట్యూబ్ చూస్తున్నాను... శ్రీదేవి కూతురు చిరు కొడుకుతో జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీయలట.ఏమిటి ఈ పిచ్చ్చి మొహాలు.కాని రోజులు ఎంత తొందరగా పరుగులు పెడుతున్నాయి.పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు .హూం.మనమేమో ఇంకా ఇంకా ఇంకా పెద్దవాళ్ళం అయిపోతున్నాం.అసలు పెద్దవాళ్ళం అయిపోతున్నాం అనే ఆలోచన ఎందుకు వస్తుంది? మనసు ముసలిది అయిపోతుందా? లేదు ఇంకా మనసు యవ్వనం లోనే ఉంది .శరీరం మాత్రం మార్పులు వస్తున్నాయి .అదే పాపం మెదడు తట్టుకోలేకపోతుంది.ఇంకా నిన్నగాక మొన్న పెళ్లి అయినట్లు అనిపిస్తుంది మరీ దారుణం గా. అమ్మా తల్లి నీకు పెళ్లి అయి ఏళ్ళు అయ్యింది .నీ కూతురు ఇప్పటికే నీ బుజానికీ దగ్గరకు వచ్చేస్తుంది.అని ఎంత హెచ్చరించినా అబ్బే మనకు ఎక్కడం లేదు :) కాని నాకు నవ్వొచ్చే విషయం ఏమిటంటే ఇరవై లో ఉన్నపుడు మొహానికి కనీసం పౌడర్ కూడా రాసేదాన్ని కాదు .ఎంత సేపు పిల్లలు వంట ఇల్లు సుబ్రం గట్రాలు. ఎవరైనా క్రొత్త గా మార్కెట్లో పలానా డ్రెస్సులు ఫ్యాషన్ అట అంటే దీని మొహం ఎప్పుడు చూసినా ఇదే గోల అని తిట్టుకునేదాని.అలాంటిది ఈ మధ్య తెగ క్రీములు కోనేస్తున్నాను.బయటకు వెళ్ళేప్పుడు ప్రత్యేకంగా శ్రద్దగా తయారవుతున్నాను .ఇప్పుడేమో వయసు పెరిగాక ఎందుకని ఇలా చేస్తున్నాను.?అమ్మో అందరి ఆడవాళ్ళల్లా నేనుకూడా తయారవుతున్నానా? అప్పుడు ఎందుకని పట్టించుకోలేదు? బహుసా అప్పుడు పిల్లల బాధ్యతా పైగా వయసులో ఉన్నాం కాబట్టి ఎలా ఉన్నా బాగుందేవాళ్ళం అనేమో.ఇప్పుడేమో ఎంతైనా తేడా వచ్చేస్తుందిగా ..పైగా పార్టీల్లో పంక్షన్లలో మిగతావారితో పోటీలు .ఇప్పుడే ఇలా ఉంటె ఇంకో అయిదేళ్ళు ఆగితే బ్యూటి పార్లర్ల చుట్టూ తిరుగుతానేమో .ప్లిచ్.బుజ్జీ అవసరం అంటావా? వద్దే మనకి ఇవన్నీ.సుబ్బరంగా హుందాగా ఉండు .నీ మొహం నీ ఇష్టం., ఇంకేవరిక్ కోసమో తయారవ్వడం ఏమిటి తోక్కలోలా.ఏమంటావ్? ఎంచక్కా పెళ్ళయ్యింది ఇద్దరు పిల్లలు హాయిగా నీట్గా ఆహ్లాదం గా ఉండు కాని అడ్డమైనవి మొహానికి పూయకు అర్ధం అయ్యిందా? గుడ్ గర్ల్

2 కామెంట్‌లు:

Overwhelmed చెప్పారు...

Nestam..

Mi ee blog ippude chusanu. Bagundandi.

Its okay to pamper youself, you deserve it, don't you think? Adi age valla kadu andi. Miku ippude mi gurinchi konchem pattinchukovataniki time dorikindanukuntanu.

నేస్తం చెప్పారు...

meerannadaanilonu point unnaadandi :)