3, ఏప్రిల్ 2011, ఆదివారం

నిన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది.నేనూ చూడలేదు.భయం వేసింది.మొదటి వికెట్ వీరు అవుత అయిపోగానే ఓడిపోతారనుకున్నాను.మామూలుగా క్రికెట్ చూడను.నాకు చిరాకు.కాని వరల్డ్ కప్ కదా.చూడాలనిపించింది.ఇది మా నాన్న కల.నాన్న ఎప్పుడూ అనేవారు సచిన్ చేతుల మీదుగా కప్ కొడితే చూడాలని.అయ్యో నాన్నా ఈసారి కుదరదేమో అని టివి కట్టేసాను .మళ్లీ మనసు ఆగక చూస్తె సచిన్ డాం వికెట్ గోవిందా.ఛీ ఛీ అని మళ్లీ కట్టేసాను .తరువాత పెట్టగానే కోహ్లి పోయాడు .ఇక చాలు మనం చూస్తె ఇలాంటి విపరీతాలే అనుకుని పూర్తిగా కట్టేసాను .చివ్వరి ఓవర్ పెట్టాను భయంగా..గెలిచేసారు.నేనూ నమ్మలేకపోతున్నా..వెంటనే నాన్న కూ కాల్ చేసాను .ఎంత సంతోషం నాన్నకు. నాన్న మాయ బజార్ సినిమా రంగుల్లో చూడాలని కోరిక అది కూడా తీరిపోయింది.నాన్నసంతోషం గా ఏమి కోరుకున్నా జరిగితే బాగుంటుంది కదా.నాన్నా మీరంటే నాకు చాలా ఇష్టం .మీరెప్పుడు సంతోషంగా ఉండాలి.

2 కామెంట్‌లు:

kiran చెప్పారు...

నేస్తం గారు.. :):)
నేను చూడలేదు అందుకే... :)..మీ లాగా లాస్ట్ లో నే చూసా...

నేస్తం చెప్పారు...

:)kiran