22, సెప్టెంబర్ 2010, బుధవారం

ఈ రోజు ఉలవారు చేసాను.. మొన్న ఎప్పుడో స్నేహ ఉలవలు ఇచ్చి వెళ్ళిపోయింది.. ఎలా వండాలో తెలియక ఇన్నాళ్ళు ఓ మూలన పడేసా ...నిన్న ఒక ఫ్రెండ్ చెప్పారు ఎలా చెయ్యాలో..సింపులే గాని టైం పడుతుంది .. అయినా మిగిలిన పనులు చేస్తూ ఉండటం వల్ల పెద్దగా నాకు శ్రమ తెలియలేదు..బాగా వచ్చింది..మావారి కసలు అది ఉలవ చారని చెప్పనే లేదు ...ఎమంటారో తిని
యూ ట్యూబ్లో లింకు కూడాఉంది


ముందు ఉలవలు ఒక బౌల్ లో (రెండు గుప్పెళ్ళు ఒక కుటుంభం కూ సరిపోతాయి)రాత్రి అంతా నాన బెట్టి ప్రొద్దున్న మూడు బౌల్స్ నీరు పోసి కుక్కర్లో ఉడికించాలి ..తరువాత నీటిని వడకట్టి ఆ నీటిలో టమాట ముక్కలు,కొద్దిగా చింత పండు పులుసు,కారం,ఉప్పు,పసుపు ,కరివే పాకు వేసి మరగనివ్వాలి ..ఈ లోపల వడగట్టిన ఉలవల్లో సగం మిక్సి పట్టి ఇందులో కలిపేయాలి.. ఈ మిశ్రమం అంతా బాగా ఉడకనివ్వాలి ..ఉలవ చారు ఎంత మరిగితే అంత రుచి ... దగ్గరకు వచ్చాకా ...(సగానికి సగం మరిగిపోవాలి)తాలింపు వేయడమే ...

1 కామెంట్‌:

రాజ్ కుమార్ చెప్పారు...

అంతా బాగానె ఉంది అక్కా... ఉలవ చారు కూడా బాగానే వచ్చింది.. మరి ఆరొజు నేను వంట లో టిప్స్ అడిగినప్పుడు నన్ను రాజు గారికి మేత గా వేసి వెళ్ళి పోవటం న్యాయమా? ధర్మమా?? :) :)
first comment naade..:)