ఈ రోజు పూజ హాయిగా చేసుకున్నా... నిన్న లిటిల్ ఇండియా వెళ్లి వెలక్కాయ ,చెరుకు గడ ,వినాయక విగ్రాహం అన్ని తెచ్చుకున్నాను. అబ్బో అయ్యేం రేట్లు బాబోయ్ ..... ప్రొద్దున్నే కుడుములు, చలిమిడి ,పులిహోర,హారిది ,పరమాన్నం ,అన్ని చేసుకుని పూజ చేశా.. సాయంత్రం డౌన్ టౌన్ ఈస్ట్ కీ వెళదాం అంటున్నారు కాని ..అబ్బా ఇంటరెస్ట్ లేదు ... బంగాల దుంప కూర్మా సరిగ్గా కుదరలేదేన్తబ్బా ఈ రోజు... తిడతారో ఏమో పాడు ...
4 కామెంట్లు:
ఈ బ్లాగు ఎప్పుడు ప్రారంభించారు? నాకు ఇప్పటి వరకు తెలియదు సుమీ :)
జాజిపూలు జ్ఞాపకాల కోసం అయితే ఇది వర్తమానపు చిన్ని చిన్ని అనుభూతుల కోసమన్నమాట. బాగుంది. :)
ఈ template చూడడానికి చాలా బాగుంది కాని కొన్ని అక్షరాలు కనిపించక పైకి కిందకి జరుపుకుంటూ చదవాల్సి వస్తోంది. Text background transparent కాకుండా ఉండేటట్టు design మార్చగలరేమో చూడండి. మా చెల్లెలు అలాంటిదే వాడుతోంది. అన్నట్టు మా చెల్లి ఈ మధ్యే బ్లాగు ప్రారంభించింది. వీలైతే ఒక సారి చూడండి.
http://swathimuthyamu.blogspot.com/
ఏదో సరదాకి ఊరికే అలా మొదలు పెట్టాను..వీలు చూసి మారుస్తా టెంప్లెట్ ... చూసాను మీ చెల్లెలి బ్లాగ్ :)
ఏమయ్యా..సాయి ప్రవీణు... సడీ చప్పిడి లేకుండా..వచ్చి కామెంట్ పెట్టేస్తావా? నాకు ఒక ముక్క చెవినేస్తే.. నీ సొమ్మెం పోయేదయ్యా..?
అయ్యో... అయ్యయ్యో... జాజిపూలు అభిమానినని జబ్బలు చరుచుకు తిరుగుతున్నానే.. రెండు నెలల నుండీ బ్లాగ్ రాస్తుంటే ఇప్పుడు చూసానా? పోయింది... నా పరువంతా హేంగ్ రివర్ లో కలిసిపోయింది.. వాఅ....వాఆఆఆ... :(
@ వేణురాం
అదే మరి. బ్లాగ్ లో పోస్ట్‌లు , కామెంట్లు చదివేసి ఏవో రెండు కామెంట్లు రాసేసి జబ్బలు చరిచేసుకోవడం కాదు. పక్కనే కొన్ని లింకులు ఉన్నాయన్న విషయం కూడా తెలుసుకోవాలి :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి