2, సెప్టెంబర్ 2010, గురువారం

ఈ రోజు చాలా విసుగ్గా అనిపించింది..నాన్నకు పోన్ చేసాను ...అమ్మతో మాట్లాడాను..అయినా ఏంటో ఒక్కోసారి దిగులు వస్తూ ఉంటుంది..నిన్న ఇంకా తను రాలేదని హీరో సినిమా చూసాను ..దిక్కుమాలిన సినిమా.. ఈ నితిన్ కీ ఏమై చచ్చిందో.. అస్సలు బాలేదు... పోనీ నేనైనా కట్టి పడేయచ్చుగా ... ఉహు ...చెత్త సోది..ఆ తరువాత అదేం సినిమా సీతారాముల పెళ్లి లంకలో అంటా ..వాడి బొంద ...నాకేం నచ్చలేదు..ఒక పార్ట్ అవ్వగానే మల్లేశ్వరి చూసాను.. నాకు కామెడి సినిమాలే నచ్చుతాయి .... హాయిగా అనిపించింది ప్రాణం.. పాప లగాన్ సినిమా ౩౩ సారి చూస్తుంది ...దానికి బాగా నచ్సినట్లుంది.. రోజు పెట్టి చూస్తుంది.. అవును నాకు కూడా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.. సినిమా అంటే అలా ఉండాలి... ఈ మధ్య వీళ్ళ హోమ వర్కులు పట్టించుకోవడం లేదు మున్దాపని చూడాలి..

3 కామెంట్‌లు:

Raja చెప్పారు...

హాయ్ బుజ్జి అక్కా, ఏంటి అక్కా కొత్త బ్లాగ్, ఈ టెంప్లెట్ బావుంది అక్కా, సరే కాని ఆ ప్రొఫైల్ ఫొటో ఎవరిది అక్కా, చాలా బావుంది.

--రాజా

నేస్తం చెప్పారు...

ఊరికే.. ఒక్కోసారి మనసులో ఏదొ ఒకటి రాయాలి అనిపిస్తుంది..ఆ పాప ఫోటో ఎక్కడో చూసి సేవ్ చేసాను... నాకు తెలియదు ఎవరో:)

పరిమళం చెప్పారు...

నేస్తంగారు , ఈఫోటోలోని అమ్మాయిని నేనూ గూగుల్ లో చూశాను ప్రపంచంలో అందమైన కళ్ళున్నఅమ్మాయిగా ఎంపికైందని గుర్తు !